Header Banner

విదేశీ విద్యార్థులపై ట్రంప్ ఉక్కుపాదం! కానీ పోరాడి వీసా సాధించుకున్న భారతీయ విద్యార్దిని!

  Mon May 19, 2025 09:45        U S A

అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వలసదారులపై ఉరుముతున్నారు. భారత్ తో పాటు పలు దేశాలకు చెందిన వలసదారుల్ని వారి స్వదేశాలకు పంపేశారు. దీంతో పాటు చిన్నా చితకా కారణాలతో విదేశీ విద్యార్ధుల వీసాలు రద్దు చేసేస్తున్నారు. ఇదే క్రమంలో ట్రంప్ సర్కార్ భారత్ కు చెందిన పీహెచ్‌డీ విద్యార్ధిని ఒకరిని ఇలాగే చిన్న కారణంతో వీసా రద్దు చేసి స్వదేశానికి పంపేందుకు సిద్దమైంది. అయితే ఆ విద్యార్ధిని దీన్ని అంత సులువుగా అంగీకరించలేదు.

 

అమెరికాలోని సౌత్ డకోటాలోని ఓ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తున్న భారతీయ విద్యార్థిని ప్రియా సక్సేనాను రోడ్డుపై ట్రాఫిక్ రూల్ ఉల్లంఘన సాకుతో వీసా రద్దు చేసి దేశ బహిష్కరణ చేసేందుకు ట్రంప్ సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఆమెకు 2027 వరకూ విద్యార్థి వీసా ఉంది. అయినా రోడ్డు రూల్స్ ఉల్లంఘించిందన్న కారణంతో హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఆమె ఎఫ్ 1 వీసాను రద్దు చేసేసింది. అలాగే ఆమె స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ రికార్డు తొలగించింది. దీంతో మే 10న ఆమె అమెరికా వదిలి స్వదేశం వెళ్లిపోవాల్సిన పరిస్దితి ఎదురైంది.



ఇది కూడా చదవండి: భారత్ కు అమెరికా మరో షాక్! కోట్ల విలువైన మామిడి పండ్ల ధ్వంసం..! 

 

కానీ ప్రియ సక్సేనా వదిలి పెట్టలేదు. ఏప్రిల్ నెలలోనే ట్రంప్ ప్రభుత్వంపై ఫెడరల్ కోర్టును ఆశ్రయించింది. తనకు తిరిగి వీసా ఇప్పించాలని, అమెరికాలో చదువుకునే అవకాశం ఇవ్వాలని వాదించింది. దీంతో వాదోపవాదాల తర్వాత ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి ఆమెకు ఊరటనిస్తూ ఉత్తర్వు ఇచ్చారు. దీంతో ఆమె డాక్టరేట్ పూర్తి చేసి గ్రాడ్యుయేట్ కావడానికి ఆమెకు అనుమతి లభించింది. ఇప్పటికే ఎంతో మంది భారతీయ విద్యార్ధులు ఇలాంటి చిన్నా చితకా కారణాలతో ట్రంప్ సర్కార్ వీసా రద్దుకు గురి కావడం, దేశ బహిష్కరణలు అవుతున్న నేపథ్యంలో ప్రియ సక్సేనా పోరాటం వారికి స్ఫూర్తి నిచ్చేలా ఉంది.


ఇది కూడా చదవండి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల విభజన! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి!

 

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #PriyaSaxena #JusticeForPriya #StudentVisaIssue #F1VisaRevoked #TrumpImmigration #IndianStudent #StudyInUSA